ఎన్నేళ్లయినా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కావడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడో ఓచోట ధర్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ వరంగల్ లో బీజేవైఎం నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నగర బీజేవైఎం అధ్యక్షుడు నరేష్ పటేల్ ఆధ్వర్యంలో షూ పాలిష్ కార్యక్రమం నిర్వహించారు.
రోడ్డుపై వెళ్తున్న బాటసారుల చెప్పులు, షూస్ శుభ్రం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు బీజేవైఎం నేతలు. ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తానన్న సీఎం… బాకీపడ్డ 33 నెలల భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు.