భానుప్రకాష్, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తాయి. బతుకులు బాగుపడతాయనుకున్నాం. 1400 మందికిపైగా యువత ఆత్మలు ఘోషిస్తున్నాయి. మూర్ఖపు సీఎం కేసీఆర్ ను గద్దె దించడం బండి సంజయ్ తోనే సాధ్యం. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం.
Advertisements
తెలంగాణకు ముందు 2.3 శాతం ఉన్న నిరుద్యోగం.. ఇప్పుడు 8 శాతం దాటింది. నిరుద్యోగ భృతి ఇస్తామని మాట తప్పిన కేసీఆర్.. ప్రతీ నిరుద్యోగికి బకాయిపడ్డ లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే. ఈ విషయంలో కేసీఆర్ మెడలొంచేదాకా మేం విశ్రమించబోం. ఉద్యోగాలతోపాటు మాకు ధర్మం కూడా ముఖ్యం. ధర్మానికి అడ్డొచ్చే వారిని చూస్తూ ఊరుకోం.