బీజేపీ పార్లమెంట్ విస్తారక్ ల సమావేశంలో పాల్గొనేందుకు బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ హైదరాబాద్ కు చేరుకున్నారు. శామీర్ పేట్ లో జరుగుతున్న ఈ సమావేశాల్లో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణలోని 119 నియోజక వర్గాల బీజేపీ ముఖ్యనేతలు, చేరికల కమిటీతో ఆయన సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జాయింట్ జనరల్ సెక్రెటరీ శివ ప్రకాష్,రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ,లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.
తెలంగాణ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన కమలం పార్టీ.. ఇక్కడ క్యాడర్ ను వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం చేయడం పై పూర్థి స్థాయిలో దృష్టి సారింది. అయితే మొయినాబాద్ ఫాం హౌస్ కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత బి.ఎల్.సంతోష్ తెలంగాణకు రావడం ఇదే మొదటిసారి కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.