తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ రావత్ పాటు 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు విశ్లేషించడానికి అవసరమైన బ్లాక్ బాక్స్ ఆర్మీ సిబ్బందికి దొరికింది.
నిన్నటి నుంచి బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్న ఆర్మీ బృందానికి పొగమంచు పెద్ద సవాల్ గా మారింది. అయితే, ఎట్టకేలకు అది లభ్యం కావడంతో ప్రమాదానికి కారణాలు తెలుసుకొనే అవకాశం అంది. హెలికాప్టర్ లో ఉన్న వారి చివరి మాటలు కూడా బ్లాక్ బాక్స్ లో రికార్డు అవుతాయి. ప్రమాదం జరిగిన 30 అడుగుల దూరంలోనే దొరికిన బ్లాక్ బాక్స్ ను ఆర్మీ అధికారులు ఢిల్లీ తీసుకొని వెళ్తున్నారు.