దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది.ఇదే సమయంలో లాక్ డౌన్ బ్లాక్ మార్కెట్ కూడా పుట్టుకొచ్చింది.మద్యం మరియు సిగరెట్ అమ్మకం దారులు ఇష్టం వచ్చిన రేట్లకు దాదాపు డబుల్,ట్రిపుల్ రేట్లకు విక్రయిస్తున్నారు.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా మద్యం, సిగరెట్ అత్యంత అవసరమైన వస్తువులుగా పరిగణింప బడవు.21 రోజుల లాక్ డౌన్ సమయంలో పాన్ అండ్ సిగరెట్ షాపులు మూసివేయబడ్డాయి.దీంతో కిరాణా షాపులు మాత్రమే సిగరెట్లు విక్రయిస్తున్నాయి. కిరాణా వ్యాపారులు ఇదే అదనుగా స్టాక్ లేదంటూ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు సిగరెట్లు విక్రయిస్తున్నారు.
మద్యం విషయంలో కేరళ మినహా దేశవ్యాప్తంగా మద్యం షాపులు మూసివేయబడ్డాయి. కేరళలో కూడా మానసిక పరిస్థితి దెబ్బ తిన్న వారికి, డాక్టర్ చీటీ ఆధారంగా పాస్ ల ద్వారా మద్యం విక్రయిస్తున్నారు.ఇక ఇప్పటికే నకిలీ లిక్కర్ దందా దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ చేశారు దుర్మార్గులు.ఇక కొన్ని వైన్ షాపులు బ్యాక్ డోర్ ద్వారా అమ్మేస్తున్నారు.అమ్మకాలు ఆగిపోయినా తమ గోడౌన్ లలో మద్యం స్టాక్ పుష్కలంగా ఉందని తయారీ దారులు అంటున్నారు.
ఇక మద్యం షాపుల యజమానులు, డిస్ట్రిబ్యూటర్ లు ఈ రంగానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.మిగతా దేశాల్లో అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
డాక్టర్లు మాత్రం మద్యం, సిగరెట్ మానడానికి ఇదే సరైన సమయం అంటున్నారు.