అనుకున్నదే అయింది. కాబూల్ ఎయిర్ పోర్టుకు సమీపంలో రెండు పేలుళ్లు జరిగాయి. ముందుగా ఓ హోటల్ దగ్గర పేలుడు జరగ్గా.. తర్వాత విమానాశ్రయం వెలుపల భారీ పేలుడు సంభవించింది. ఇది ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నాయి అమెరికా రక్షణ దళాలు. ఈ పేలుల్లో 13 మంది మరణించినట్లు వార్తలొస్తున్నాయి.
రెండో పేలుడులో అమెరికా భద్రతా బలగాలకు చెందిన ముగ్గురు గాయపడినట్లు తెలుస్తోంది. ఎయిర్ పోర్టుకు ఎవరూ రావొద్దు ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రకటన విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఈ పేలుళ్లు జరిగాయి.