భీమ్లా నాయక్ టీం నుంచి అదిరిపోయే వీడియో బయటకొచ్చింది. ఈమధ్యే పవన్ కు సంబంధించిన వీడియో, ఫస్ట్ సాంగ్ రికార్డులు క్రియేట్ చేయగా.. తాజాగా రానా పాత్రకు సంబంధించిన వీడియోను వదిలారు. పంచె కట్టుకుని మాస్ లుక్ తో కనిపించాడు రానా. డైలాగులు కూడా బాగున్నాయి.
పవన్, రానా కలిసి నటిస్తోన్న ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకుడు. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.