కాపీ కొట్టడంలో కొందరి తెలివి మామూలుగా ఉండదు. హైటెక్ యుగంలో కొత్తకొత్తగా ఆలోచిస్తూ పరీక్షల్లో కాపీ కొడుతుంటారు కొందరు విద్యార్థులు. అలాంటిది.. భావితరాలను ఉన్నత మార్గంలో నడిపే టీచర్ల పోస్టుల పరీక్షకు హాజరైన అభ్యర్థులే కాపీ కొడితే..! రాజస్థాన్ లో జరిగిందీ ఘటన.
రాజస్థాన్ లో తాజాగా టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ జరిగింది. అయితే గంగాషహర్ ప్రాంతంలో ముగ్గురు అభ్యర్థులు బ్లూటూత్ ఉండే చెప్పులు వేసుకుని వచ్చారు. పరీక్షకు ముందే గమనించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు బయట ఇంకో ఇద్దర్ని అరెస్ట్ చేశారు.
ఓ ముఠా వీరికి బ్లూటూత్ చెప్పులను రూ.6 లక్షల చొప్పున అమ్మినట్లు తెలుసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అరెస్ట్ చేసిన వారినుంచి సిమ్ కార్డులు, బ్లూటూత్ డివైజ్ లు సహా పలు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.