బ్లూటూత్ హెడ్ ఫోన్స్ పేలి ఓ యువకుడు మృతి చెందిన ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. ఉదైపురియా గ్రామానికి చెందిన రాకేష్… ఈమధ్యే బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కొనుగోలు చేశాడు. ఫోన్ మాట్లాడుతున్న సమయంలో అవి ఒక్కసారిగా పేలిపోయాయి.
ఈ ఘటనలో రాకేష్ చెవులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుడు ధాటికి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
హార్ట్ స్ట్రోక్ తో రాకేష్ చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్లూటూత్ హియర్ ఫోన్స్ పేలి వ్యక్తి చనిపోవడం దేశంలో ఇదే తొలిసారని అంటున్నారు అధికారులు.