బాలీవుడ్ నటుడు సోనూసూద్ పై పోలీసులకు బిఎంసి ఫిర్యాదు చేసింది. జుహులోని తన భవనాన్ని అనుమతులు లేకుండా హోటల్ గా మార్చారనే ఆరోపణలపై బిఎంసి ఫిర్యాదు చేశారు. అయితే తాను ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని సోనూసూద్ ఆరోపిస్తున్నారు. అవసరమైతే ఈ విషయం పట్ల హై కోర్టును కూడా ఆశ్రయిస్తానని తెలిపారు.
ఇక కరోనా సమయంలో వేలాది మందికి సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. సోనూ చేసిన సేవలకు గాను ఎంతోమంది తమ పిల్లలకు సైతం సోనూసూద్ పేర్లను పెట్టుకున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది సోనూ పై అభిమానంతో గుడులను కూడా కట్టించారు.