గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడి వారమైందో లేదో.. అప్పుడే బీజేపీ కార్పొరేటర్లు టార్గెట్ అవుతున్నారు. బీఎన్‌రెడ్డినగర్ డివిజన్‌లో బీజేపీ తరఫున గెలుపొందిన కార్పొరేటర్ లచ్చిరెడ్డి కారు అద్దాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇంటి ముందు పార్క్ చేసిన ఫార్చునర్ కారు అద్దాలను ఇటుకలతో పగలగొట్టారు. కారు అద్దాలను పగలగొట్టే సమయంలో సైరన్ మోగడంతో.. దుండగులు పారిపోయారు.
కార్పొరేటర్‌గా గెలుపొందడంతో తిరుపతి వెళ్లి మొక్కు తీర్చుకుని రాత్రి 8 గంటలకే ఇంటికి చేరుకున్నారు లచ్చిరెడ్డి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.