ఏపీ రాజధాని అధ్యయనం నిర్వహించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఏపీ సీఎంకు నివేదిక సమర్పించింది. క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్‌తో సమావేశమైన బోస్టన్ ప్రతినిధి బృందం మద్యంతర నివేదికను అందజేసింది. ఈ నివేదిక కూడా జీఎన్‌రావు కమిటీ ప్రతిపాదనలకే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. శాశ్వత నిర్మాణాలు ఇంకా మొదలుకానందున కొత్త రాజధాని నిర్మాణం కన్నా అభివృద్ధి చెందిన నగరంలో రాజధానిని ఏర్పాటు చేయటం ఉత్తమమని బోస్టన్ నివేదిక పేర్కొన్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 21న పూర్తి స్థాయి నివేదికను జీఎన్ రావు కమిటీ ఇప్పటికే ఏపీ సర్కార్‌కు అందించింది. అభివృద్ది వికేంద్రీకరణకే ఆ కమిటీ కూడా మొగ్గు చూపిన సంగతి తెలిసిందే.
ఈ రెండు నివేదికలపై పది మంది మంత్రులు, ఆరుగురు అధికారులతో కూడిన హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీ జనవరి 6న భేటీ కాబోతుండగా… జనవరి 20న కమిటీ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ హైపవర్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా… అసెంబ్లీలో చర్చ చేపట్టి ఆమోదిస్తారని ఏపీ సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి.