బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా నాటు పడవ మునిగిన సంఘటన విశాఖ జిల్లా చింతూరులో చోటు చేసుకుంది. రంపచోడవరం డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్రిగూడెం కు చెందిన ఐదుగురు కుటుంబసభ్యులతో ఆంధ్రా సరిహద్దు రాష్ట్రమైన ఒరిస్సా రాష్ట్రం సన్యాసి గుడా గ్రామంలో తన బంధువులు ఇంటికి వెళ్లి సాయంత్రం సమయంలో నాటు పడవ మీద సీలేరు నది దాటుతుండగా ప్రమాదవశాత్తు పడవ సీలేరు నదిలో మునిగిపోయింది.
ప్రమాద సమయంలో పడవలో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తుండగా వారిలో మర్రిగూడెం గ్రామానికి చెందిన తులా, సంజూ అనే ఇద్దరు గల్లంతు అయ్యారు. ఈ పడవలో నర్సింగ్ తో పాటు మరో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.