వాల్తేరు వీరయ్య. చిరంజీవి హీరోగా నటించిన సినిమా. ఆయన డైహార్డ్ ఫ్యాన్ బాబి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఓ అభిమానిగా చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నానో అవన్నీ వాల్తేరు వీరయ్యలో పెట్టానంటున్నాడు ఈ దర్శకుడు. అదే టైమ్ లో కథకు కూడా ప్రాముఖ్యత ఇచ్చానంటున్నాడు.
“నిజానికి ఈ కథ లాక్ డౌన్ కి ముందు ఒక ఫ్యాన్ బాయ్ గానే చెప్పాను. అయితే లాక్ డౌన్ లో పరిస్థితులు మారిపోయాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఓటీటీకీ అలవాటు పడ్డారు. డిఫరెంట్ కంటెంట్ కి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అందరినీ అలరించే కథ చెప్పాలని ప్రత్యేక ద్రుష్టి పెట్టాం. దాంట్లో నుండి వచ్చిన క్యారెక్టరే రవితేజ గారిది. ఒక ఫ్యాన్ బాయ్ గా మొదలుపెట్టి ఒక డైరెక్టర్ గా ఇద్దరి పాత్రలని బ్యాలెన్స్ డిజైన్ చేశాను. ఇందులో చివరి వరకూ కథే గొప్పగా కనిపిస్తుంది. బీ,సీ సెంటర్ ఆడియన్స్ తో పాటు మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులని కూడా అలరించే అన్ని గుణాలు లక్షణాలు వాల్తేరు వీరయ్యలో కనిపిస్తాయి.”
ఇలా అసలు విషయాన్ని బయటపెట్టాడు బాబి. వాల్తేరు వీరయ్య రొటీన్ గా ఉన్నప్పటికీ ఆకట్టుకుంటుందంటూ ఆ మధ్య ఓ ఫంక్షన్ లో చిరంజీవి అన్న మాటలను బాబి సమర్థించాడు.
వాల్తేరు వీరయ్య సినిమాలో కథ కొత్తగా అనిపించకపోవచ్చని, కానీ చిరు-రవితేజ కాంబినేషన్ కొత్తగా ఉంటుందని, సన్నివేశాలు బోర్ కొట్టించకుండా ఉంటాయని చెబుతున్నాడు. ఓవరాల్ గా ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ ను ఎంజాయ్ చేస్తారని హామీ ఇస్తున్నాడు.