బాబీ డియోల్ బ్యాక్-టు-బ్యాక్ ప్రాజెక్ట్‌లను చేస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. బహుముఖ నటుడిగా కూడా నిరూపించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఇటీవల విడుదలైన లవ్ హాస్టల్ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు.
అయితే ఇటీవల సిద్ధార్థ్ కన్నన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, బాబీ చాలా విషయాల గురించి మాట్లాడాడు. వాటిలో తన కుటుంబం గురించి కూడా చెప్పుకొచ్చారు.
నా ఫ్యామిలీ లో ఉన్న వారందరూ చాలా సాధారణ వ్యక్తులని, తెలివైన వ్యక్తులు కాదని చెప్పుకొచ్చాడు. అందుకే ప్రజలు తరచుగా మమ్మల్ని ఉపయోగించుకుంటారని అన్నారు. గతంలో చాలా మందికి సహాయం చేసినా వారి ప్రయోజనాన్ని పొంది ఇంటి పేరు చెడగొట్టి వెళ్లిపోయారని తెలిపారు. కానీ మనం మంచి మనుషులమని, దేవుడు మనందరినీ చూస్తున్నాడని అన్నారు.
అలాగే బాలీవుడ్‌లోకి ప్రవేశించాలనుకునే ఎవరికైనా విద్య ఎంత ముఖ్యమో వివరించాడు బాబీ డియోల్. గ్లామర్ ప్రపంచంలో కెరీర్ వర్కవుట్ కాకపోతే కనీసం ఇంకేదైనా చేయాలని చెప్పాడు.
నా కొడుకు ఆర్యమాన్ డియోల్ బిజినెస్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడని, ఒక నటుడిగా మారడానికి ముందు తన చదువును పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు బాబీ డియోల్.