అలవైకుంటపురంలో సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాడు అల్లుఅర్జున్. ఇప్పుడే అదే జోష్ మీద సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. మొదట ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతిని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల విజయ్ సేతుపతి తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో ఇప్పుడు బాబీ సింహాను ఖరారు చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
ఇక ఇటీవల విడుదల అయిన అల్లుఅర్జున్ లుక్ విమర్శకులను సైతం ఆకట్టుకుంది. ఆర్య, ఆర్య 2 సినిమా తో అల్లుఅర్జున్ ను స్టైలిష్ గా చూపించిన సుకుమార్ ఇప్పుడు డీగ్లామర్ తో చూపిస్తున్నాడు. ఇక సినిమా ఏ విధంగా ఉండబోతుందా అనే ఆలోచనలో పడ్డారు సినీ అభిమానులు.