ఆహారం విషయంలో కొందరు పొదుపు పాటించినా మరికొందరు మాత్రం వెనక్కు తగ్గే అవకాశం ఉండదు. చాలా వరకు కూడా రుచికరమైన ఆహారానికి మన దేశంలో మంచి ప్రాధాన్యత ఉంటుంది. రుచికరమైన కూరగాయలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు సుమీ.
మన తెలుగు రాష్ట్రాల్లో మనకు ఎక్కువగా కనపడేది ఆగాకరకాయ. కొన్ని ప్రాంతాల్లో అలా పిలుస్తారు, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకోలా పిలుస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన కాలంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వర్షా కాలం చివరి నుంచి ఇది మనకు మార్కెట్ లో కనపడుతుంది. నువ్వు పది కేజీలు కొన్నా సరే కొసరు ఒక్క కాయ వేయడానికి కూడా సతాయిస్తూ ఉంటారు.
ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వండే ఈ కాయను అంగాకరకాయ అనికూడా పిలుస్తూ ఉంటారు. తెలంగాణాలో కొన్ని ప్రాంతాల్లో బోడ కాకరకాయలు అంటారు. దీని సీజన్ ప్రారంభం అయ్యేది ఆగస్టులో. అప్పుడు దీని ధర ఒక్క కిలోకి 120 నుండి 200 రూపాయల వరకు ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా సరఫరా పెరిగితే వంద నుంచి 120 వరకు ఉంటుంది. అడవి ప్రాంతాల్లో మాత్రమే ఇవి దొరుకుతూ ఉండేవి. అయితే వీటిని బయట కూడా పండిస్తున్నారు. వీటిల్లో పెద్దగా ఉండే కాయలు హైబ్రీడ్ కాయలు. అవి నాటు కాయల కన్నా కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. మరి రుచి కూడా అంతే ఉంటుందిగా…?