దిశ హత్యాచార నిందితుల మృతదేహలు కుళ్లిపోతున్నాయని గాంధీ ఆసుప్రతి వైద్యులు హైకోర్టుకు తెలిపారు. ఇప్పటికే సగానికి పైగా మృతదేహలు కుళ్లిపోయాయని, మరో వారం రోజుల్లో పూర్తిగా కుళ్లిపోతాయని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ హైకోర్టుకు వివరించారు. మృదేహాలను -2 డిగ్రీల సెల్సియస్‌లో భద్రపర్చామని తెలిపారు.
అయితే, దేశంలోని ఇతర ఆసుపత్రుల్లో ఇంకా భద్రపర్చేందుకు అవకాశం ఉందా అని కోర్టు గాంధీ ఆసుపత్రి వైద్యులను ప్రశ్నించగా… తమకు తెలియదని సమాధానం చెప్పారు. దీంతో మృతదేహలను బంధువులకు అప్పగించాలా…? రీ పోస్ట్‌మార్టం చేయాలా…? చేస్తే స్వతంత్ర సంస్థకు ఇవ్వాలా లేక మళ్లీ గాంధీ ఆసుపత్రికే అప్పజెప్పాలా అనే అంశంపై హైకోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజ్‌లో మొదట ఈ మృతదేహలు భద్రపర్చినా… అక్కడ సరైన వసతులు లేని కారణంగా గాంధీ మార్చురీకి తరలించారు.
రోడ్డు మీద నడిచినా పన్ను కట్టాలా కేసీఆర్ ?
జైపూర్ బాంబు పేలుళ్ల దోషులకు ఉరిశిక్ష
ఈ నెల 23 సాయంత్రం 5లోపు రీ పోస్ట్‌మార్టం చేయాలని.. గాంధీవైద్యులతో కాకుండా రీపోస్ట్‌మార్టం కోసం మెడికల్ బోర్డ్ ఆఫ్ ఇండియాను తెలంగాణ ప్రభుత్వం కోరాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రీపోస్ట్‌మార్టంను వీడియో తీయటంతో పాటు కలెక్షన్స్ ఆఫ్ ఎవిడెన్స్‌ను సీల్డ్ కవర్‌లో భద్రపర్చాలని కోర్టు ఆదేశించింది. రీ పోస్టుమార్టం తర్వాత పోలీసుల సమక్షంలో మృతదేహలను కుటుంబ సభ్యులకు మృతదేహలను అప్పగించాలని కోర్టు ఆదేశించింది.
ఇక ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన గన్స్, బుల్లెట్స్, ఫోరెన్సిక్ నివేదిక, పోస్ట్‌మార్టం నివేదికలు అన్నింటిని భద్రపర్చాలని హైకోర్టు పోలీస్ శాఖను, ప్రభుత్వాన్ని ఆదేశించింది.