తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. అంటే.. తల్లిదండ్రి తర్వాత దేనుకంటే ముందు పిల్లలపై ఆ బాధ్యత గురువుకు ఉంటుంది అని. కానీ.. సమాజంలో ఆ స్థానానికి విలువ లేకుండా చేస్తున్నారు కొందరు అద్యాపకులు. గురువు అనే పదానికి మచ్చ తెస్తున్నారు.
ఇలాంటి ఓ ఘటనే చిత్తూరు జిల్లా కార్వేటినగరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చోటుచేసుకుంది. అయితే.. సోమయ్య(42) అనే వ్యక్తి స్థానిక కళాశాలలో కాంట్రాక్టు ఫిజిక్స్ అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అతని టార్చర్ తట్టులేక ఆ విద్యార్ధిని కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో ఆమె బంధువులు శనివారం కళాశాల ప్రాంగణంలో సోమయ్యను చుట్టుముట్టి దేహశుద్ధి చేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
దీంతో కళాశాల ప్రిన్సిపాల్ బాలసుబ్రహ్మణ్యం రాజు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. స్పందించిన ఉన్నతాధికారులు అతన్ని విధుల నుంచి తప్పించినట్లు తెలిస్తోంది. ఘటనకు సంబంధించి స్థానిక సీఐని విచారణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.