అల్లు అర్జున్ పుష్ప బాలీవుడ్ నాట సంచలన విజయం సాధించింది. ఎవరు ఊహించని విధంగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా చూసిన చాలా మంది స్టార్స్ అల్లు అర్జున్ నటన పై, పుష్ప సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా తాజాగా అనుపమ్ ఖేర్ రీసెంట్ గా పుష్ప సినిమా చూసి రెస్పాన్స్ తెలిపారు. తాను కూడా బన్నీ తో నటించాలని కోరుకుంటున్నానని అన్నారు. సీనియర్ నటుడు అయిన ఆయన ఇలా అన్నారు అంటే బన్నీ నటన ఎంత నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక సుకుమార్ దర్శకత్వంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా సమంతా స్పెషల్ సాంగ్ లో నటించారు. అలాగే అనసూయ సునీల్ కీలక పాత్రలో నటించగా మలయాళ స్టార్ నటుడు ఫహద్ విలన్ గా నటించారు.
మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పార్టు 2 షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు మేకర్స్.