వివాదస్పద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గురువారం ముంబై రోడ్లపై నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్టు బాలీవుడ్ యాక్టర్, డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ ప్రకటించారు. నిరసన ర్యాలీలో పాల్గొనాల్సిందిగా ప్రజలను కోరారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా బాలీవుడ్ సెలబ్రిటీస్ ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో తమ గొంతు వినిపిస్తున్నారు. ఒంటరిగా సోషల్ మీడియాలో అభిప్రాయాలు వెల్లడించే సమయం ముగిసిందని…వివాదస్పద చట్టానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకు రావాలని ఫర్హాన్ అఖ్తర్ కోరారు. పౌరసత్వ చట్టంపై ఎందుకు ఎందుకు ఆందోళన చెందుతున్నాడో ఫోటోలతో సహా వివరించాడు. ఎన్.ఆర్.సి తర్వాత నిర్భందిస్తారనే భయాందోళనపై కూడా వివరాలు వెల్లడించారు.
ఈ నిరసనలు ఎందుకు ముఖ్యమైనవో మీరు తెలుసుకోవాలంటే ఈ నెల 19వ తేదీన ముంబై క్రాంతి మైదాన్ లో కలుసుకుందాం అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.