బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సినిమా అంటే ప్రాణం పెట్టి పని చేసే వాళ్ళల్లో హీరో అక్షయ్ కుమార్ ఒకరు. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ నటుడు సినిమా కోసం ఎంతైనా కష్ట పడతాడు. సినిమా కోసం ఎంత పెద్ద రిస్క్ అయినా చేస్తాడు. పెద్ద హీరోలు అనగానే స్టంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్టర్స్ దాదాపుగా ఎవరినైనా డూప్ ని పెట్టి సీన్ తీసే ప్రయత్నం చేస్తుండడం చూస్తూనే ఉంటాం.
కానీ ఆ అవకాశం ఉన్నా కూడా అక్షయ్ మాత్రం ఎప్పుడూ సొంతంగా చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అలాంటి అక్షయ్ షూటింగ్ లో గాయడినట్టు స్వయానా ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అక్షయ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘బడేమియా చోటేమియా’. ఈ మూవీ షూటింగ్ స్కాట్లాండ్ లో జరుగుతుంది. ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా అక్షయ్ స్కాట్లాండ్ వెళ్ళారు.
అక్కడ షూటింగ్‌లో టైగర్ ష్రాఫ్‌తో కలిసి స్టంట్స్ చేస్తుండగా అక్షయ్ మోకాలికి గాయమైంది. హెలికాప్టర్ పై స్టంట్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. విషయం గ్రహించిన మూవీ టీమ్ వెంటనే స్పందించి.. వైద్యులను సంప్రదించారు. అక్షయ్ పరిస్థితిని పరిశీలించిన డాక్టర్లు.. కొంత కాలం పాటు ఎలాంటి స్టంట్స్ చేయకూడదని చెప్పారు.
అక్షయ్ మోకాలికి గాయం కారణంగా ప్రస్తుతానికైతే.. మూవీ షూటింగ్ కి అంతరాయం ఏర్పడినట్టు సమాచారం. అయితే అక్షయ్ కొన్ని రోజుల రెస్ట్ తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాతే మిగతా యాక్షన్ సీన్స్ తీసే అవకాశం ఉన్నట్టు సినీ వర్గాల టాక్. అయితే ఆ సీన్స్ కూడా అక్షయ్ తో తీయిస్తారా.. లేదంటే అతని ప్లేస్ లో డూప్ ను పెట్టి తీస్తారా అన్న విషయంపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అక్షయ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.