బాలీవుడ్ బాద్ షాగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న షారుఖ్ ఖాన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ముంబాయిలో తనకున్న ఓ నాలుగు అంతస్థుల భవనాన్ని కరోనా వైరస్ క్వారెంటైన్ కేంద్రంగా వాడుకునేందుకు ఇచ్చేశాడు. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు, అనాధలకు ఇది ఉపయోగపడాలని కోరుకున్నట్లు మున్సిపల్ అధికారులు కృతజ్ఞతలు చెబుతూ వెల్లడించారు.
తన ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ద్వారా మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు సహాయం చేసిన షారుఖ్… మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లో డాక్టర్లకు ప్రొటెక్షన్ కిట్స్ పంపిణీ చేయటంలో ముందున్నాడు. అంతేకాదు… ముంబాయి మురికి వాడల్లో ఉండే వారి ఆకలి తీర్చటం కోసం తన మీర్ ఫౌండేషన్ ఫౌండేషన్ ద్వారా ప్రతి నెలలో 5500 కుటుంబాలకు రోజువారీ నిత్యవసర వస్తువులను అందిస్తున్నారు.
అంతేకాదు తన ఐపీఎల్ టీం ద్వారా పీఎం కేర్ ఫండ్ కు కూడా భారీ మొత్తాన్ని ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
ఇలా షారుఖ్ ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా పేద ప్రజలకు కష్టకాలంలో తోడుండాలని నిర్ణయం తీసుకోవటం పట్ల దేశవ్యాప్తంగా హార్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.