బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ, ఇందిరాగాంధీ, ఆమె భర్త ఫిరోజ్ గాంధీ లపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు ఆమెపై ఐటీ యాక్ట్ -2008 కింది పలు సెక్షన్లు నమోదు చేశారు. అహ్మదాబాద్ లో ఆమెను ఆదుపులోకి తీసుకున్న పోలీసులు రాజస్థాన్ లోని బుందీకి తీసుకెళ్లారు. అక్టోబర్ లో సోషల్ మీడియాలో పాయల్ రోహత్గీ పెట్టిన అభ్యంతకర పోస్టులపై రాజస్థాన్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ చర్మేష్ శర్మ బుందీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
తన అరెస్ట్ పై పాయల్ రోహత్గీ ట్విట్టర్ లో స్పందించారు. ”గూగుల్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా తాను పెట్టిన పోస్టింగ్ లపై అరెస్ట్ చేశారని..భావ ప్రకటనా స్వేచ్ఛ ఒక నవ్వులాట గా మారింది” అంటూ ట్వీట్ చేశారు. తన ట్వీట్ లలోప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, కేంద్ర హోం మినిస్టర్ ఆఫీసులను ట్యాగ్ చేశారు.