బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఊపిరితిత్తు క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురుకావటంతో ఆయన ఇటీవల ఆసుపత్రిలో చేరగా… కరోనా లక్షణాలుగా భావించి కరోనా టెస్ట్ చేశారు. కరోనా లేదని నిర్ధారణ కావటంతో ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఆసుపత్రిలో జరిపిన పరీక్షల్లో ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని బాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది.
లంగ్ క్యాన్సర్ కు చికిత్స తీసుకునేందుకు సంజయ్ దత్ అమెరికా వెళ్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తుండగా… దీన్ని సంజయ్ దత్ అధికారికంగా దృవీకరించలేదు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక సంజయ్ దత్ చేసిన ట్వీట్ పై ఇప్పుడు రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.
— Sanjay Dutt (@duttsanjay) August 11, 2020