బాలీవుడ్ లో విషాదం నెలకొంది. నటుడు, చిత్ర నిర్మాత సతీష్ కౌశిక్ ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని నటుడు అనుపమ్ ఖేర్ తెలిపారు.” మరణం అనేది సత్యమని నాకు తెలుసు కానీ నా బెస్ట్ ఫ్రెండ్ సతీష్ కౌశిక్ గురించి ఇలా రాస్తానని కలలో కూడా అనుకోలేదు. 45 ఏళ్ళ స్నేహానికి ఫుల్ స్టాప్. నువ్వు లేని జీవితం ఎప్పటికీ ఇలాగే ఉండదు సతీష్..ఓం శాంతి” అని ఖేర్ ట్వీట్ చేశారు.
హరియాణాలోని మహేంద్రగఢ్ లో 1956 ఏప్రిల్ 13 న జన్మించిన సతీష్ కౌశిక్ 1983 లో మాసూమ్ అనే చిత్రంతో నటుడిగా తన కెరీర్ ను ప్రారంభించారు. స్కాం 1992 వెబ్ సిరీస్, ఎమర్జెన్సీ, మిస్టర్ ఇండియా, ఉడ్తా పంజాబ్ వంటి చిత్రాలలో నటించారు.
తేరే నామ్, వాదా వంటి పదికి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. సతీష్ కు భార్య, కూతురు ఉన్నారు. అతని మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అయితే సతీష్ కౌశిక్ గతంలో కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.