నటుడు సోను సూద్ విజయవాడ లో పర్యటించిన సంగతి తెలిసిందే. అంకుర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు సోను సూద్. ఈ నేపథ్యంలోనే బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు స్వాగతం పలికగా… అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సోనూసూద్. అనంతరం తీర్ధ ప్రసాదాలను వేదపండితులు అందించారు.
ఇక సోనుసూద్ రాకతో విజయవాడలో సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు రియల్ హీరో అంటూ నినాదాలు చేస్తూ హడావిడి చేశారు.