బాలివుడ్ అందాల నటి మాధురి దీక్షిత్, ప్రీతి జింటా, లారాదత్త… తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహరాష్ట్ర, హర్యానాలో జరుగుతున్న ఎన్నికల్లో బాలీవుడ్ తారలు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కోడలు, ప్రముఖ నటి జెనీలియా, భర్త రితేష్ దేశ్‌ముఖ్ సహా అమీర్‌ఖాన్, సంజయ్ దత్ సోదరి ప్రియాదత్, దియా మీర్జా,షారుక్, హృతిక్ రోషన్, దీపికాపదుకునే, అనిల్ కపూర్, జాన్ అభ్రహంలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటు హక్కు మన హక్కని దానిని ఉపయోగించుకుని సంవర్ధవంతమైన నాయకున్ని ఎన్నుకోవాలన్నారు. మహారాష్ట్రలో 288 , హర్యానాల్లో 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.