బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 8న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు ఇటీవలే ప్రకటించారు. అయితే RRR చిత్రంలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా నటిస్తుంది. అయితే త్రివిక్రమ్ కూడా అంతే డిఫ్రెంట్ గా ఎన్టీఆర్ తో చెయ్యబోతున్న సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకురావాలని ఆలోచిస్తున్నారట.
గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మారో సారి వస్తున్నఈ కాంబోలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరుగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ని తీసుకోవాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫిక్స్ అయ్యారట. ఇకపోతే మరో హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు ఎప్పటినుంచో వినిపిస్తోంది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ మూవీ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు. త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ ఇదే టైటిల్ ఫిక్స్ చేశాయని చూస్తున్నారట.