స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది జాన్వీ కపూర్. ‘దఢక్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ అందాల భామకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమ సినిమాకు తన లోపాలను సరిదిద్దుకుంటూ నటనను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తోంది. అయినా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో కొంత మంది నెటిజన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ‘నెపోకిడ్’ అని విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ ట్రోల్స్, విమర్శలపై లేటెస్ట్ గా జాన్వీ కపూర్ స్పందించింది.
తనపై వస్తున్న ట్రోల్స్ చూసి విసిగిపోయానని చెప్పుకొచ్చింది జాన్వీ. మనల్ని ఎంతగా ట్రోల్ చేస్తే వాళ్లకు అంత సంతోషమని.. మనల్ని విమర్శించడంలోనే వాళ్లు ఆనందం పొందుతారని చెప్పుకొచ్చింది. ఎప్పుడూ సూటిపోటి మాటలతో బాధపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎంత కష్టపడి పనిచేసినా కొంతమంది కావాలనే తప్పులు వెతుకుతున్నారని వాపోయింది.
ఇది రెగ్యులర్‌గా కొనసాగుతోందని, దీనివల్ల ఎప్పుడూ వార్తల్లో ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి నెపో కిడ్ అని ఎగతాళి చేస్తున్నారని బాధపడింది. తన సినిమా రిలీజైన ప్రతిసారి కావాలనే తనపై విమర్శలు చేస్తారని చెప్పుకొచ్చింది. వాటిని చూసి మొదట్లో బాధపడ్డానని.. కానీ ఇప్పుడు వాటికి అలవాటు పడిపోయా అని చెబుతోంది.
ఇప్పుడు అలాంటి ట్రోల్స్ వస్తుంటే నవ్వుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. యాక్టింగ్ రానప్పుడు సినిమాలు ఎందుకు చేస్తున్నావ్ అని చాలామంది ట్రోల్స్ చేస్తున్నారని గుర్తు తెచ్చుకుంది. తన బలాలు, బలహీనతలు ఏంటి? ఎలా నటిస్తున్నా అనే విషయాలు తనకు తెలుసంది. కాబట్టి ఇలాంటి వారి వ్యాఖ్యలు పట్టించుకోవద్దంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.