బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముక్కు సూటి మనిషి…బాలీవుడ్ లో బంధుప్రీతి గురించైనా..సామాజిక రాజకీయ అంశంపైనైనా తన మనసులోని మాటను నిర్భయంగా చెప్పుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారిన పౌరసత్వ చట్టం విషయంలో బాలీవుడ్ సైలెంట్ గా ఉండడంపై కూడా తన అభిప్రాయాలను ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొహమాటం లేకుండా వెల్లడించారు.
బాలీవుడ్ లో చాలా మంది పిరికోళ్లున్నారు..వాళ్లకు వెన్నెముక ల్లేవు. దేశం గురించి వాళ్లకు పట్టింపు లేదు. వాళ్లేంటో వాళ్లకే స్పష్టత లేదు. ఈ దేశానికి, ఈ ప్రజలకు తాము అతీతులమనుకుంటారు. బాలీవుడు నటులు వారికి వారే సిగ్గుపడాలి. రోజుకు 20 సార్లు అద్దంలో చూసుకోవడం…జిమ్ లకు వెళ్లి కండలు పెంచడం…ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోలు పెట్టడమే వాళ్ల పని. ప్రజల వల్లనే మనకు ఈ గుర్తింపు వచ్చిందనే విషయాన్ని మర్చిపోయారు. వాళ్ల తరుపున గొంతు విప్పి మాట్లాడరు. ప్రజలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారేమోననే భయం..రాజకీయ పార్టీలు టార్గెట్ చేస్తాయోమోననే భయం ఎక్కువన్నారు. నటులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. వాళ్ల స్థాయిలకు న్యాయం చేయాలన్నారు.
వీధుల్లోకి వచ్చి ఉద్యమంలో పాల్గొంటారా? అని అడిగితే కీలక నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందన్నారు.