బాలీవుడ్ నటి కరీనా కపూర్ తన అభిమానులను మరోసారి మెస్మరైజ్ చేయబోతున్నారు. కరీనా ‘గుడ్ న్యూజ్’ సినిమాలో నటిస్తోంది. అయితే నేటి యంగర్ జనరేషన్ తో తనను పోల్చవద్దంటున్నారు. తాను రెండు దశాబ్ధాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. నేటి యంగర్ జనరేషన్ తో తనను పోల్చడం తప్పంటున్నారు కరీనా.ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీనా మాట్లాడుతూ.. ”ప్రజలు తనను ఎందుకు ఫస్ట్ ప్లేస్ లో చూడాలనుకుంటున్నారో అర్ధం కావడం లేదు… వారి పోలికే సరికాదు..నేను ఈ జనరేషన్ లో భాగం కాదు” అని చెప్పారు. ఇరవై ఏళ్ల తర్వాత ఎవరైనా ఇంకా పనిచేస్తుంటే.. వాళ్లని ఈ జనరేషన్ తో పోల్చుతారా? ప్రజలు ఎందుకు అలా చేస్తున్నారో ఆశ్యర్యంగా ఉంది. ఈ జనరేషన్ లో…ఈ పోటీలో నేను భాగం కాదు అన్నారు. నా సొంత పనులతో నేను చాలా సంతోషంగా ఉన్నాను అని తెలిపారు.
ఇక తన సినిమాల ఎంపిక గురించి చెబుతూ…చిన్న సినిమాలకే తాను ప్రాధాన్యత నిస్తానన్నారు.
కరీనా కపూర్ రిప్యూజీ సినిమాతో 2000 సంవత్సరంలో బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ సినిమాలో ఆమె అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించారు. ఆ తర్వాత 2001 లో వచ్చిన హిస్టారికల్ డ్రామా అశోక ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత వచ్చిన కబీ ఖుషీ..కబీ గమ్..చమేలీ, జబ్ వుయ్ మెట్, దేవ్, త్రీ ఇడియట్స్, బజ్ రంగి భాయ్ జాన్, ఉడ్తా పంజాబ్ సినిమాలు కూడా కరీనాకు గుర్తింపు తెచ్చాయి.