కరోనా సెకండ్ వేవ్ బాలీవుడ్ ను షేక్ చేస్తుంది. బాలీవుడ్ అంతా వరుసగా కరోనా వైరస్ బారిన పడుతుంది. ఇప్పటికే అమీర్, అక్షయ్, రణ్ బీర్ కపూర్, సంజయ్ లీలా బన్సాలీ, అలియా భట్ వంటి వారు కరోనా బారిన పడగా, తాజాగా బ్యూటీ కత్రినా కైఫ్ కు కరోనా నిర్ధారణ అయ్యింది.
తనకు వైరస్ సోకిందని… ప్రస్తుతం హోం క్వారెంటైన్ లో ఉన్నట్లు కత్రినా తెలిపింది. డాక్టర్ల సలహా మేరకు వైద్యం తీసుకుంటున్నానని, తనను కలిసిన వారంతా టెస్ట్ చేయించుకోవాలని కోరింది. అభిమానులంతా జాగ్రత్తగా ఉండాలని…కరోనాను నిర్లక్ష్యం చేయవద్దని సూచించింది.