బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనస్ మంచు కొండల్లో క్రిస్ మస్ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఆ ఇద్దరు మంచు పర్వతాల్లో స్నో మొబైల్ వాహనంపై తిరుగుతూ ఎంజాయ్ చేసిన ఫోటోలను తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రియాంక ఆ స్నోమొబైల్ వాహనానికి బ్యాట్ మొబైల్ అని పేరు పెట్టారు. క్రిస్మస్ రోజు శాంతాక్లజ్ స్వయంగా తన వాహనాన్ని నడిపినంత ఆనందంగా ఉందన్నారు. నిక్ జోనస్ గిప్ట్ గా ఇచ్చిన ఆ వాహనాన్ని పెద్ద రెడ్ కలర్ కవర్ లో కప్పి తీసుకెళ్లారు. ప్రియాంక తన కుటుంబ సభ్యుల ఫోటోను కూడా షేర్ చేశారు. ఆమె తల్లి మధు, తమ్ముడు సిద్ధార్ధ చోప్రా, నిక్ పెంపుడు కుక్కలు డయానా, జీనో లు కూడా ఫోటోలో కనిపిస్తున్నాయి.
గత ఏడాది క్రిస్మస్ వేడుకల్లో నిక్ తో కలిసి కుకీస్ తయారు చేస్తున్న ఫోటోలు పోస్ట్ చేసిన ప్రియాంక ఇప్పుడు నిక్, కుటుంబ సభ్యులతో కలిసి వున్న ఫోటోలు పోస్ట్ చేశారు. నిక్ జోనస్ కూడా ప్రియాంక స్నో మొబైల్ బైక్ పై కూర్చున్న ఫోటోను పెట్టి ” నాకు నా భార్య చిరునవ్వుని చూడడం కంటే మించిన ఆనందం లేదు” అని రాశారు.
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ కోసం ‘వైట్ టైగర్’ సినిమా షూటింగ్ ను ప్రియాంక పూర్తి చేసుకుంది. ఆ సినిమా పోస్ట ప్రొడక్షన్ లో ఉంది.