రాజకీయాల్లో ఉన్నప్పటికీ సినిమాలకు కూడా ఓటేస్తుండటంతో పవన్‌తో సినిమా చేయడానికి దర్శకులు పోటీ పడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని… పవన్ కోసం కథను సిద్దం చేస్తున్నారు. అయితే ఇప్పటికే పింక్ రీమేక్ షూటింగ్‌లో పాల్గొంటున్న పవన్, పింక్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ పిరియాడిక్ మూవీకి ఇప్పటికే పవన్ ఓకే చెప్పాడు.
ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఓ అల్యూమినియం ఫాక్టరీలో భారీ సెట్స్ వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన ఇద్దరు భామలు నటించబోతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి కోసం బాలీవుడ్ హీరోయిన్స్ కోసం చూస్తున్న డైరెక్టర్ క్రిష్… కియారా అద్వానిని ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలను డేట్స్ కుదరక వదులుకున్న కియారా… పవన్‌తో సినిమాను మాత్రం ఓకే చేసినట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. అయితే మరో హీరోయిన్‌ను మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తోండగా… అతి త్వరలోనే కియారా కూడా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
Advertisements
ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఎఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.