బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె జె. ఎన్.యూ ను సందర్శించడంపై భిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఆమె తీరును పలువురు వ్యతిరేకిస్తుండగా.. పలువురు సమర్థిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ తార సోనాక్షి దీపిక పదుకొనె జె. ఎన్.యూ ను సందర్శించడాన్ని సమర్ధించారు. ట్విట్టర్ వేదికగా ఆమె స్పందిస్తూ దీపికకు అభినందనలు… తన ధైర్యాన్ని ఆమె వ్యక్తం చేసింది. ఇది నిశ్శబ్దంగా కూర్చొనేందుకు అనువైన సమయం కాదంటూ ట్వీట్ చేసింది. మీరు ఏ రాజకీయా పార్టీకైనా మద్దతునివ్వండి. కానీ హింసకు మద్దతునివ్వరు కదా అంటూ పేర్కొంది. అయితే బీజేపీ నేతలు దీపికా చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమె చెపాక్ మూవీ ప్రమోషన్ కోసమే జె. ఎన్.యూ కు వెళ్లిందని ఆరోపిస్తున్నారు. చెపాక్ సినిమాను బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » దీపికాకు మద్దతుగా బాలీవుడ్