ప్రభాస్ కు ఒకే చెప్పిన ఆర్ఆర్ఆర్ బ్యూటీ - Tolivelugu

ప్రభాస్ కు ఒకే చెప్పిన ఆర్ఆర్ఆర్ బ్యూటీ

బాహుబలి సినిమా తో తన మార్కెట్ ను పెంచుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ముగియక ముందే ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ సినిమాకు ఒకే చెప్పేశాడు.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించటానికి హీరోయిన్ కోసం నాగ్ అశ్విన్ వెతుకుతుండగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అలియా భట్ దృష్టి లోకి వచ్చిందట. అలియాబాట్ ను సంప్రదించగా గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిందని సమాచారం. అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ దాదాపుగా ఈ సినిమా లో అలియాభట్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp