గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. కాగా ఈ సినిమాలో మహేష్ సరసన మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ విషయాన్ని కీర్తిని స్వయంగా ప్రకటించింది.
అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కి స్కోప్ ఉందట. ఆ పాత్రకి గాను అనన్య పాండేని ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటింపజేసేందుకు సర్కారు వారి పాట టీమ్ ప్రయత్నాలు చేస్తుందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడగానే ఆమెకు కథ వినిపించాలని పరశురామ్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే చిత్రయూనిట్ మాత్రం ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.