రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ -2022 సౌదీ అరేబియాలో అట్టహాసంగా జరుగుతోంది. జెద్దాలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో హాలీవుడ్ భామలు అందాల విందు చేస్తున్నారు.
దీనికి తోడు ఇటు బాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం తమదైన ఫ్యాషన్ డ్రెస్సింగ్‌తో అభిమానులకు కనువిందు చేస్తున్నారు.
ముఖ్యంగా కరీనా కపూర్, ప్రియాంక చోప్రా జోనాస్, సోనమ్ కపూర్ ఆహూజాలు జెద్దా ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిసిపోయారు. రెడ్ కార్పెట్ పై బాలీవుడ్ భామల అందాలను చూసి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
జెద్దాలో వైట్ టైగర్ నటి ప్రియాంక చోప్రా రెండు గౌన్లలో కనిపించారు. హాలీవుడ్ ప్రసిద్ధ ఫ్యాషన్ స్టైలిస్ట్ టోనీ వార్డ్ కోచర్ డిజైన్ చేసిన కేప్-స్లీవ్ గౌనులో మాజీ ప్రపంచ సుందరి తళుక్కుమన్నారు. మరోవైపు నికోలస్ జెబ్రాన్ డిజైన్ చేసిన పసుపు రంగు శాటిన్ గౌన్‌లో కనిపించి ఈ అమ్మడు అదరగొట్టింది.
వీర్ డీ వెడ్డింగ్ నటి కరీనా కపూర్ మోనిక్ లుహిల్లియర్ బ్లూగౌను డ్రెస్సులో కనిపించి అమ్మడు అందరి మతులు పోగెట్టింది. కరీనా కపూర్ అందానికి సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ తాన్యా ఘావ్రీ తనదైన ఫ్యాషన్ వర్క్‌తో మరింత అందంగా కనిపించేలా చేశారు.
సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన చీరలో ఈ అందాల భామ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫుల్-స్లీవ్, క్రాప్డ్ సీక్విన్ బ్లౌజ్ విత్ మ్యాచింగ్ శారీలో ఈ అందాల భామ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె అందాలకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.
ఇక రెడ్ స్ట్రక్చర్డ్ గౌనులో సోనమ్ కపూర్ ను చూడటానికి రెండు కండ్లు సరిపోవడంలేదని అభిమానులు చెబుతున్నారు. రియాకపూర్, చాందినీవాబీ టీమ్, సాన్యకపూర్, మనీషా మేల్వానీలు ఈ డ్రెస్ ను ప్రత్యేకంగా సోనమ్ కోసం డిజైన్ చేశారు.
ఇక లెబానన్ డిజైనర్ డిజైన్ చేసిన మారిగోల్డ్ యెల్లోకలర్ అవుట్ ఫిట్‌లో బాలీవుడ్ ముద్దుగుమ్మను చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు.