దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం చత్రపతి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి కలెక్షన్లను సైతం రాబట్టింది. అయితే ఈ సినిమాకు బాలీవుడ్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీమేక్ చేస్తున్నారు. మరో వైపు ఈ సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం కూడా చేయబోతున్నాడు.
అయితే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను సాహో దర్శకుడు సుజిత్ లేదా వి.వి.వినాయక్ కు దర్శకత్వం అప్పగించపోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే హిందీ వెర్షన్ కోసం కొత్తగా కొన్ని మార్పులు చేస్తున్నారట..మాతృక కు అందించిన రచయిత విజయేంద్రప్రసాద్ ప్రస్తుతం ఇదే పనిలో బిజీగా ఉన్నారట.