బాలీవుడ్ లోని అగ్ర హీరోలలో ఒకరు జాన్ అబ్రహం. తాజాగా ఆయన ఎటాక్ అనే ఓ భారీ సినిమాను చేశారు. అయితే.. ప్రమోషన్స్ లో భాగంగా దక్షిణాది సినిమాలపై కొన్ని విమర్శలు గుప్పించారు. ఇప్పుడా వ్యాఖ్యలు సినిమా ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి.
తెలుగు సినిమాల్లో నటిస్తారా అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఇక్కడ మార్కెట్ పెంచుకోవడం కోసం తాను తెలుగు సినిమాల్లో సెకండ్ హీరోగా నటించనని పేర్కొన్నారు. అలాగే బాలీవుడ్ ఏ ఇండస్ట్రీకీ తీసిపోదు.. సినిమా ప్రపంచంలో ఎప్పుడూ నెంబర్ వన్ గా ఉంటోందని కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలుగు సినిమాల్లో నటించనని ఒక్క మాటలో చెబితే పోయేది కానీ.. బాలీవుడ్డే నెంబర్ వన్ అంటూ వేరే ఇండస్ట్రీలను తేలిక చేసి మాట్లాడటం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. జాన్ చేసిన కామెంట్ల దెబ్బకు విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు.
ఈ క్రమంలోనే ఎటాక్ మూవీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దీనికి ఆ కామెంట్సే కారణమని అంటున్నారు సినీ ప్రముఖులు. తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.3 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే రాబట్టింది ఎటాక్ చిత్రం.