హీరోయిన్ రష్మిక మందన్న గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఛలో సినిమా తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు వరుస విజయాలను సాధించింది. అయితే ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ బిజీ బిజీ గా గడుపుతుంది. ఒక్క టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది. సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసి మిషన్ మజ్నూ సినిమాలో నటిస్తుంది.
Advertisements
కాగా తాజాగా సిద్ధార్థ్ ..రష్మిక పై ప్రశంసలు కురిపించారు. ఆమె అత్యంత ప్రతిభావంతమైన నటి అని ..ఆమెతో జత కట్టడం తనకు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చిందన్నారు. తమ పెయిర్ తెరపై చాలా ఫ్రెష్ గా ఉంటుందని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు.మరి ఆ సినిమా ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.