బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. గత మూడేళ్లుగా ప్రేమిస్తున్న నటాషా దలాల్ ను జనవరి 24న వరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. నిజానికి ఈ వివాహం గతేడాది మే నెలలో జరగాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడింది.
అయితే ఈ వివాహానికి టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారట. బౌన్సర్లు, పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారట. ఈ వివాహాన్ని అతి తక్కువ మంది బంధువులు స్నేహితుల మధ్య జరుపుతున్నట్లు సమాచారం. ఈ వివాహ వేడుకకు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ కూడా హాజరుకానున్నారట.