ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి… తన నెక్ట్స్ సినిమాలపై ఇప్పటికే ఫోకస్ చేశారు. ఆచార్య తర్వాత చిరు లూసీఫర్ రీమేక్ చేయనుండగా, ఆ తర్వాత డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్న బాబీ… హీరోయిన్ ఎంపికపై చిరంజీవితో చర్చించినట్లు తెలుస్తోంది. చిరుతో మాట్లాడిన తర్వాత పాన్ ఇండియా రిలీజ్ ఆలోచన రావటంతో… బాలీవుడ్ హీరోయిన్ తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోనాక్షి సిన్హా పేరును బాబీ సూచించగా, చిరంజీవి కూడా ఓకే చెప్పినట్లు ఫిలింనగర్ టాక్.
దీంతో బాబీ టీం సోనాక్షి సిన్హాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.