ఆమెకు అంత పొగరా? మహేష్ భార్యపై కామెంట్!

నమ్రతా శిరోద్కర్.. ప్రిన్స్ మూవీస్‌లో ఒకప్పుడు హీరోయిన్.. ఆ తర్వాత మహేష్ బాబు జీవిత భాగస్వామి. పెళ్లి కాకముందు ప్రొడ్యూసర్ గా, మోడల్ గా నమ్రత బాలీవుడ్ లో మంచి పేరున్నమ్మాయి. 93లో ఫెమినా మిస్ ఇండియాగా కూడా ఎలెక్ట్ అయ్యింది. ఇన్ని క్వాలిటీలుండబట్టే ఆమెని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఘట్టమనేని రాకుమారుడు. మొన్న పదో తేదీకి వీళ్లకు పెళ్లయి పదమూడేళ్ళు. ఇన్ని సంవత్సరాల్లో ప్రిన్స్-నమ్రతల దాంపత్యం మీద ఏ ఒక్క రిమార్కూ లేదు. టాలీవుడ్ సర్కిల్స్ లో గానీ.. సోషల్ మీడియాలో గానీ తన మీద ఎటువంటి ‘టైం పాస్’ వార్త రాకుండా జాగ్రత్త పడింది నమ్రత . కానీ.. తాజాగా.. ఆమె బిహేవియర్ మీద ఒక మరక పడిపోయింది.

నమ్రతకు టెంపర్ ఎక్కువని, మిగతావాళ్ళమీద లెక్కలేనితనం చూపుతుందని ఆమె పాత కొలీగ్ మలైకా అరోరా బహిరంగ విమర్శ చేస్తోంది. మోడలింగ్ ఫీల్డ్ లో తామిద్దరం పార్లల్ గా పనిచేశామంటూ.. అప్పట్లో నమ్రత వల్ల తాను పడ్డ ఇబ్బందుల్ని ఏకరువు పెడుతోంది బాలీవుడ్ బ్యూటీ మలైకా. నమ్రత దురుసు ప్రవర్తన తనతో పాటు చాలామందిని ఇరిటేట్ చేసేదన్న మలైకా.. ఇప్పుడు మాత్రం తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ బ్యాలెన్స్ చెయ్యడానికి ట్రై చేసింది.

‘వోగ్ బీఎఫ్‌ఎఫ్‌’ కోసం ఒక ఇంటర్వ్యూలో మలైకా చేసిన ఎలిగేషన్స్ ఇవన్నీ. వీటిని ప్రిన్స్ ఫ్యామిలీ ఎంత మేరకు సీరియస్ తీసుకుంటుందో గానీ.. మహేష్ ఫాన్స్ మాత్రం మంటెక్కిపోతున్నారు. ‘మా మేడమ్ కి సర్టిఫికెట్ ఇచ్చేంత సీన్ మలైకా అరోరాకి లేదు’ అంటూ విరుచుకు పడుతోంది ప్రిన్స్ ఫ్యాన్స్ క్లబ్.