టాలీవుడ్ లో పూజ హెగ్డే కి మంచి ఫాలోయింగ్ ఉంది. అటు బాలీవుడ్ లో సైతం ఆమె వరుస సినిమాలతో బిజీ అవుతుంది. బాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లు అందరూ సీనియర్లు కావడంతో సౌత్ లో పాపులర్ అవుతున్న హీరోయిన్ ల మీద దృష్టి సారించారు అక్కడి హీరోయిన్లు. ఈ నేపధ్యంలోనే పూజా హెగ్డే పేరు ఎక్కువగా వినపడుతుంది. త్వరలోనే మరో హీరోయిన్ కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు.
నిన్న పూజా హెగ్డే పుట్టిన రోజు వేడుకలు మంచి సరదాగా జరిగాయి. ఈ వేడుకల్లో ఇద్దరు స్టార్ హీరోలు పాల్గొన్నారు. ఒకరు వెంకటేష్, మరొకరు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ హీరోగా… ‘కిసీ గా భాయ్ కిసీ గా జాన్’ అనే సినిమాలో వెంకటేష్ కూడా నటిస్తున్నారు. ఆ సినిమాలో పూజ సల్మాన్ కు లవర్ గా నటిస్తుంది. ఈ నేపధ్యంలో స్పాట్ లోనే పూజ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేసారు.
ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ పూజా కు భారీ గిఫ్ట్ ఇచ్చాడనే టాక్ నడుస్తుంది. డైమండ్ బ్రేస్లెట్ పూజ హెగ్డే కు గిఫ్టుగా ఇచ్చాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని… ఇటీవల షూటింగ్ స్పాట్ నుంచి ఆమెను సల్మాన్ సాగనంపిన విధానమే దానికి ఉదాహరణ అంటున్న తరుణంలో ఈ పరిణామం మాత్రం ఆసక్తిని రేపుతుంది