కరోనా మహమ్మారి కారణంగా లక్షల మంది చనిపోతున్నారు. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా బలైపోతున్నారు. తాజాగా బాలీవుడ్ సినీ గేయ రచయిత ఇబ్రహీం ఆష్క్ మృతిచెందారు.
ఇబ్రహీం ఆష్క్ వయసు 70 సంవత్సరాలు. అయితే ఇటీవల ఆయన కు కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా శనివారం రోజు ఇబ్రహీం ఆష్క్ కు శ్వాస తీసుకోవడం కష్టం అవ్వటం తో ఆయనను ముంబై లోని మెడిటెక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు.
ఇక కరోనా తో పాటు న్యూమోనియా కూడా సోకడం ఆయన ప్రాణాలు కోల్పోయారు.అయితే సోమవారమే ఆష్క్ అంత్యక్రియలు జరగనున్నాయని ఆయన కుమార్తే ముసాఫా ఖాన్ తెలిపారు.