యవ్వనం గువ్వలాంటిది. దీనికి వయస్సుతో పనిలేదు. మనసులు కలిసిన ఇద్దరి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉన్నా లవ్ ఎఫెక్షన్ లో తేడా ఉండదు. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ప్రేమాయణం నెట్టింట్లో కుర్రకారు గుండెల్నిషేక్ చేస్తోంది. లేట్ వయస్సులో ఈ హాట్ లవ్ ఏమిటబ్బా అంటూ నెటిజన్లు ట్వీట్లు ఇచ్చుకుంటున్నారు. 43 ఏళ్ల అందాల ముద్దుగుమ్మ సుస్మితా సేన్ తన కన్నా 15ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మాన్ షాల్ తో కొంతకాలంగా గాడమైన ప్రేమలో మునిగి తేలుతోంది. అంతేకాదు ఊరంతా తమ ప్రేమ కబుర్లు తెలిసేలా తరచూ సోషల్ మీడియా వేదికపై సుస్మిత సందడి చేస్తున్నది.
సుస్మితా సేన్ – రోహ్మాన్ షాల్ జంట ప్రస్తుతం విహారయాత్రలో హాపీగా ఉందట. తమ హ్యాపీ లవ్ సీన్స్ ఫొటోలను సుస్మిత ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. సముద్రంపై పేద్ద బోట్‌లో ప్రయాణిస్తూ తన ప్రియుడి ఒడిలో ఎంతో హాయిలే హలా అంటూ ఖుషీ చేస్తున్న ఫొటోలు కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్నాయి.
బికినీ ధరించి, దానిపైన ఓ పొడవాటి గౌన్ వేసుకోని రోహ్మాన్ ఒడిలో రొమాంటిక్ యాంగిల్‌లో వాలి ఉన్న సుస్మిత ఫోటోలు చూస్తుంటే ప్రేమ మైకంలో అంతేలే అనిపిస్తుంది. సుస్మితా సేన్ – రోహ్మాన్ షాల్ హాట్ హాట్ ఫోజులు నెట్లో బాగా వైరల్ అవుతున్నాయి.