మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్మకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమా రూపొందుతోంది. హరిక అండ్ హాసిని వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేఖను తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతుంది.
త్రివిక్రమ్ తన సినిమాల్లోని కీలకమైన పాత్రల్లో సీనియర్ హీరోయిన్స్ ను తీసుకుంటూ ఉంటాడు. అలా గతంలో ఆయన నదియా, ఖుష్బూ, టబూ వంటి వారితో కీలకమైన రోల్స్ ను చేయించాడు. అలాగే ఇప్పుడు మహేష్ తో చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ కోసం సీనియర్ హీరోయిన్ రేఖను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది. తాజాగా శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.
మహేష్ బాబుకి ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. రేఖ ఈ సినిమాలో చేయడమనేది నిజమే అయితే, తప్పకుండా అది ఈ మూవీకి ప్రత్యేకమైన ఆకర్షణే అవుతుంది.