బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. తనకు ఎలాంటి లక్షణాలు లేకున్నా… కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని, హోం క్వారెంటైన్ లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించాడు.
తనకు వైరస్ ఉందని తెలియగానే… తన స్టాఫ్ అందర్నీ టెస్ట్ చేయించుకోవాలని అమీర్ ఖాన్ కోరారు. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్న అమీర్… కరోనా నుండి పూర్తిగా కోలుకున్న తర్వాత షూటింగ్ లో పాల్గొంటారని ఆయన టీం తెలిపింది.
తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ఇటీవలే ప్రకటించాడు. దీంతో తనకు కరోనా సోకిన విషయం ఆయన టీం వెల్లడించింది. అమీర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.